వాహనం ఢీకొని జింక మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం–బి.కొత్తకోట రోడ్డులో సోమవారం రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. రోడ్డు దాటే క్రమంలో జింకను వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో ద్విచక్రవాహదారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు.
మామిడి తోట కంచెకు నిప్పు
రామసముద్రం : రామసముద్రం మండలం, మినికి గ్రామం వద్ద ఎంఎస్. సలీం బాషా, నజీర్‌బాషాలకు చెందిన మామిడి తోట కంచెకు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరికి చెందిన 50 ఎకరాల మామిడి తోటలో స్వల్పంగా కంచె, మామిడి చెట్లు అగ్నికి ఆహుతైనట్లు స్టేషన్ అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో నష్టం సుమారు రూ. 5వేలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన ముక్కల వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
బాలుడిపై కుక్కల దాడి
మదనపల్లె టౌన్ : వీధిలో ఆడుకొంటున్న రెండేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయ పరచాయి. సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధిత బాలుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు .. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతి, పాళ్యం కొండకు చెందిన సురేష్ కుమారుడు యశ్విన్ (02) ఇంటికి సమీపంలోని వీధిలో ఆడుకుంటూ ఉండగా .. అదే వీధిలో ఉండే చంద్ర పెంచుకున్న కుక్కలు యశ్విన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుమారుడి కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే వెళ్లి కుక్కల బారి నుంచి కాపాడి, చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై బాధితుని కుటుంబీకులు స్థానిక తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాహనం ఢీకొని జింక మృతి
వాహనం ఢీకొని జింక మృతి


