ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Feb 10 2026 7:37 AM | Updated on Feb 10 2026 7:37 AM

ప్రాణ

ప్రాణం తీసిన ఈత సరదా

మదనపల్లె టౌన్‌ : ఈత సరదా ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లి దండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. క్వారీ గుంతలో గల్లంతై ప్రాణాలు విడచిన విద్యార్థి మృతికి సంబంధించి మదనపల్లె తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని అప్పారావు తోటకు చెందిన లప్సర్‌బాషాకొడుకు అసన్‌ (14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం స్నేహితులు ఏడుగురితో కలసి పోతపోలు గ్రామం, టిడ్కో ఇళ్లకు సమీపంలో ఉన్న జబ్బల క్వారీలోని నీళ్లలోకి వెళ్లారు. అంతకు ముందు స్విమ్మింగ్‌పూల్‌ తలపించేలా నీళ్లు జబ్బల క్వారీలో ఉన్నట్లు ఓ వ్యక్తి సోషల్‌ మీడియలో పెట్టిన పోస్టుకు ఆకర్షితులై వీరంతా వెళ్లారని సమాచారం. వారిలో ముగ్గరు స్నేహితులు ఇంటికి వచ్చేయగా, మరో నలుగురు క్వారీ గుంతలో ఈత కొడుతుండగా అనస్‌ గల్లంతయ్యాడు. స్నేహితులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. చీకటి పడటంతో సోమవారం ఉదయం అగ్ని మాపక అధికారి శివప్ప తన సిబ్బందితో వెళ్లి క్వారీ వద్దకు వెళ్లి నీటి గుంతలో వెతికి అనస్‌ మృతదేహం వెలికితీశారు. బాగా చదివి తల్లి దండ్రులను ఆదుకుంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పిల్లలు సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి ఈతకు వెళ్లరాదని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

క్వారీ గుంతలో గల్లంతై ప్రాణాలు

విడిచిన విద్యార్థి

ప్రాణం తీసిన ఈత సరదా1
1/1

ప్రాణం తీసిన ఈత సరదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement