ఆటో బోల్తా: వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: వ్యక్తి మృతి

Feb 10 2026 7:37 AM | Updated on Feb 10 2026 7:37 AM

ఆటో బోల్తా: వ్యక్తి మృతి

ఆటో బోల్తా: వ్యక్తి మృతి

మదనపల్లె టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ మండలం, మర్రిపాడు గ్రామం. మొరవపల్లెకు చెందిన గంగారాజు(48) తన భార్య నాగమణి, కూతుళ్లు దివ్య, దీప, సునీత, తోబుట్టువు జ్యోతి అదే ఊరికి చెందిన సయ్యద్‌ బాష ఆటోలో సీటీఎంలోని నలవీర గంగా భవాని అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చారు. అక్కడ మొక్కులు చెల్లించుకుని మదనపల్లెకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఆటో కాశీరావు పేట వద్దకు వెళ్లగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తుండగా గంగరాజు మృతిచెందాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ కళావెంకటరమణ తెలిపారు.

కారు ఢీకొని గాయాలు

పుంగనూరు : మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బోయకొండకు వెళ్తున్న కారు, మదనపల్లె వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న గంగిరెడ్డి(40), బాలకృష్ణ(35)లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మదనపల్లె టౌన్‌ : కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, మర్రిమాకులపల్లె పెద్దూరుకు చెందిన గంగిరెడ్డి(38), బాలకృష్ణ(40)లు సొంత పనిమీద బైకులో మదనపల్లెకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లె పంచాయతి, కృష్ణాపురం వద్ద బోయకొండ కొండ నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం వారిని తిరుపతికి రెఫర్‌ చేశారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బైక్‌, ఆటో ఢీకొని..

సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.పోలీసలు వివరాలమేరకు .. చిన్నమండెం మండలం దిగువగొట్టివీడుకు చెందిన అన్నదమ్ములు ప్రభాకర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డిలు ద్విచక్రవాహనంలో దేవపట్ల నుంచి రాయచోటికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎర్రగుంట్లకు చెందిన సయ్యద్‌సాబ్‌ ఆటోలో రాయచోటి నుంచి సొంతగ్రామానికి వెళతుండగా నారాయణరెడ్డిపల్లె జగనన్న ఆర్చీ సమీపంలోకి రాగానే బైక్‌ –ఆటో ఢీకొన్నాయి. క్షతగాత్రులను 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నియామకం

కడప ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిరెడ్డి శ్యాంసుందరరెడ్డిని 7,8 తేదీలలో విజయవాడ లో జరిగిన ఏపీటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ఖాదర్‌బాషా, శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement