రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : గుర్రంకొండలో మంగళవారం రాత్రి రోడ్డు క్రాస్ చేస్తున్న స్కూటరిస్టును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హర్షద్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు గుర్రంకొండకు చెందిన హర్షద్(35) స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో అర్థరాత్రి వరకు పనులు చేశాడు. అనంతరం షాపు మూసుకుని ఇంటికి బైకులో వెళుతుండగా బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి కుటుబ సభ్యులకు సమాచాం అందించారు. వారు బాధితున్ని ఓ ప్రైవేట్ వాహణంలో చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.
చింత చెట్టు పైనుంచి కిందపడి ..
మదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలంలో రైతు రామప్ప చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. బయపప్పగారిపల్లి పంచాయతి, పామూరోళ్లపల్లెకు చెందిన రైతు రామప్ప(55) ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్దకు బుధవారం కుటుంబీకులతో కలసి వెళ్లాడు. అక్కడ ఉన్న చింత చెట్టు ఎక్కి చింత కాయలు కోస్తుండగా, ప్రమాద వశాత్తు కింద పడ్డాడు. ఈ ఘటనలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు అతన్ని కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముక్కు, నోట్లో రక్తం ఆగకుండా కారుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం రైతు పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు


