వ్యక్తి అదృశ్యం
వాల్మీకిపురం : పట్టణంలోని నాయక్‌వీధికి చెందిన షేక్ మొహద్దీన్ బాషా కుమారుడు షేక్ అన్వర్ బాషా గత నెల రోజులుగా కనిపించడం లేదని భార్య షబానా బేగం తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త గత నెల రోజులుగా ఇంటికి రాలేదని, కనిపించడం లేదని వాపోయింది. తన భర్త ఆచూకి తెలిసిన వారు 98668 10788, 90597 60939కు సమాచారం అందించాలని కోరింది.
మిద్దైపెనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి
మదనపల్లె టౌన్ : మిద్దైపె నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు .. నిమ్మనపల్లె మండలం, ముస్టూరు గ్రామం, గౌనిగారిపల్లెకు చెందిన ప్రభాకర్(40), రోజూ మాదిరిగానే మంగళవారం మదనపల్లె మండలంలోని కొత్తపల్లెకు భవన నిర్మాణం పనులు చేయడానికి వచ్చాడు. సహచరులతో కలసి పనులు చేస్తుండగా మిద్దైపె నుంచి ప్రమాద వశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించే లోపే ప్రభాకర్ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు మార్చురీలో ఉంచి తాలూక పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో
వృద్ధుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : తంబళ్లపల్లె మండలంలో ఓ వృద్ధుడు మంగళవారం అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంబళ్లపలె మండలం, కోటకొండ గ్రామం, బిఎస్‌ఆర్ పల్లికి చెందిన నాగప్ప(80) గత కొంత కాలంగా మంచం పట్టి అనారోగ్యంతో లేవలేనిస్థితిలో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బీడి తాగిన నాగప్ప పొరపాటున మంచంపైనే కాలుతున్న బీడి ముక్కను వదిలేశాడు. దీంతో మంటలు అంటుకుని కాలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని చికిత్స నిమిత్తం హుటా హుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించి మెరుగైన వైద్యం అవసరం ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. ఘటనపపై తంబళ్లపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బేకరి మాస్టర్ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : మదనపల్లెలోని ఓ బేకరీలో పనిచేసే యువకుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఘటనపై బాధితుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పొన్నేటి పాళ్యంకు చెందిన ఆనంద్(25) స్థానిక చిత్తూరు బస్టాండులో కాపురం ఉంటూ సీటీఎం రోడ్డులోని ఓ బేకరి షాపులో మాస్టర్ గా పని చేస్తున్నాడు. భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో నెలకొన్న సమస్యలు తాళలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆనంద్‌ను తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
వ్యక్తి అదృశ్యం
వ్యక్తి అదృశ్యం


