మదనపల్లెలో చీటీల బాగోతం | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో చీటీల బాగోతం

Feb 9 2026 7:34 AM | Updated on Feb 9 2026 7:34 AM

మదనపల్లెలో చీటీల బాగోతం

మదనపల్లెలో చీటీల బాగోతం

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో చీటీల మోసం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఇద్దరు మహిళల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘నువ్వు మోసం చేశావని ఒకరు.. కాదు నువ్వే మోసం చేశావు’ అంటూ రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగారు. మండలంలోని చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య స్థానికంగా ఉండే రాజేశ్వరి వద్ద చీటీలు వేశానని, అంతేకాకుండా పది మంది వద్ద చీటీలు కట్టించానని తమకు రూ.1.20 కోట్ల డబ్బులు ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. రాజేశ్వరి ఇంటి ముందు కూర్చొని ఆందోళనకు దిగారు. దీనికి స్పందించిన రాజేశ్వరి తనకు లక్ష్మీ ప్రసన్ననే అన్యాయం చేసిందన్నారు. నమ్మి వేరొకరి వద్ద పూచీలు పడి చీటీలు వేయిస్తే రూ.60 లక్షల చీటీ డబ్బులు కట్టకుండా మోసగించిందన్నారు. ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు తనపై బురద చల్లుతోందని రాజేశ్వరి ఆరోపించారు. ఇద్దరూ వాదోపవాదాలకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తరువాత కొంత సేపటికి పరిస్థితి సద్దుమణిగింది.

ఇంటి వద్ద బాధితుల బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement