రామసముద్రంలో విషాదఛాయలు
రామసముద్రం : బి.కొత్తకోటలో సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం(36) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ మేరకు పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామమైన రామసముద్రంకు తీసుకురావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, బంధుమిత్రులు బోరున విలపించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అతనికి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు నడుమ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చిన్నపిల్లలు తమ తండ్రి ఇంక రాడు అనే విషయం తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు.


