అర్జీలకు సత్వర పరిష్కారం
మదనపల్లె టౌన్ : ప్రజల నుంచి వచ్చే అర్జీలన్నీ పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎస్పీ అందుబాటులో లేక పోవడంతో స్థానిక వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫి, ఎస్‌ఐ గాయత్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద, అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటిని ఆన్ లైన్ చేసి జిల్లా ఎస్పీ లాగిన్‌కు పంపించారు. అర్జీలను పరిశీలించి స్పందించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. సంబంధిత పోలీసులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అన్నిరకాల అర్జీలపై విచారణ జరిపి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సీఐ, ఎస్‌ఐలను ఎస్పీ హెచ్చరించారు.


