ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి

Feb 13 2026 3:13 AM | Updated on Feb 13 2026 3:13 AM

ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి

ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి

ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి

కడప కార్పొరేషన్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. గురువారం శాననమండలిలో ఆయన ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. 12వ పీఆర్‌సీ నియామకం ఇంకా పూర్తి కాలేదని, దీనితోపాటు మధ్యంతర భృతి చెల్లింపుపై కూడా ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. వారికి 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యూటీ, పెన్షన్‌ బకాయిలు, ఇతర బెనిఫిట్లు భారీగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, టీఏ, సరెండర్‌ లీవుల బకాయిలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. గ్రంథాలయ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు, పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్‌ 2025 వరకూ ఉన్న 3.64 శాతం డీఆర్‌ బకాయిలను ఏప్రిల్‌ 2026 నుంరరి విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఇంతవరకూ చెల్లించలేదన్నారు. ఈ బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement