108లో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

108లో ప్రసవం

Feb 9 2026 7:34 AM | Updated on Feb 9 2026 1:01 PM

యువకు

యువకుడి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : కురబలకోట మండలంలో శనివారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం ఎరబల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి కుమారుడు నితీష్‌రెడ్డి(18) ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి, ప్రాథమిక చికిత్సలు అందించారు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. డాక్టర్లు అక్కడి నుంచి రుయాకు వెళ్లాలని రెఫర్‌ చేశారు.

 

పీలేరు రూరల్‌ : 108 అంబులెన్స్‌ వాహనంలో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం కావలిపల్లెకు చెందిన రాములమ్మ శనివారం పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం పీలేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యులు కాన్పు కష్టమవుతుందని తిరుపతికి రెఫర్‌ చేశారు. ఆమెను 108 అంబులెన్స్‌ వాహనంలో తిరుపతికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో భాకరాపేట సమీపంలో కవలపిల్లలకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్‌లో 108 ఈఎంటీ అశోక్‌, పైలట్‌ ఎం.శ్రీనివాసులు వైద్య సేవలు అందించారు.

ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణ

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పట్టణంలో అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్‌ నగర్‌లో కాపురం ఉంటున్న సుహేల్‌(26), రియాజ్‌(24) అన్నదమ్ములు. వీరికి తన తండ్రి కొనిచ్చిన ఇంటి స్థలాలు ఉన్నాయి. తండ్రి చనిపోవడంతో వాటిని పంచుకోవడంలో వాటాలు కుదరక కొంత కాలంగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇద్దరూ గొడవపడి ఒకరిపై మరొకరు కర్రలతో కొట్టుకుని తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు గమనించి బాధితులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఒకరిపై మరొకరు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మహమ్మద్‌ రఫి కేసు విచారణ చేస్తున్నారు.

చేపల కోసం వెళ్లి బాలుడి మృతి

పులిచెర్ల(కల్లూరు) : చేపల కోసం వెళ్లి ఈతరాక నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్లూరు దాసరి గూడెంకు చెందిన రవితేజ(19) పూరేడు వారిపల్లె దగ్గర ఉన్న హంద్రీ–నీవా కాలువలో చేపలు పట్టడానికి వల తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో వల తీస్తుండగా వల కాలికి తగులు కోవడంతో ఈత రాని తాను బోర్ల పడి బురదలో కూరుకుపోయాడు. కొంత సేపటి తరువాత స్థానికులు గుర్తించి హుటాహుటిన కల్లూరు ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అగస్త్యేశ్వరస్వామి

ఆలయంలో చోరీ

రాజంపేట : చెయ్యేరు నది ఒడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దొంగలు మొదట సోలార్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను లాగేశారు. తలుపుల తాళాలు పగులగొట్టారు. ఆలయంలో ఉన్న హుండీ ఎత్తుకెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రధాన అర్చకులు శివయ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ తలుపులు తెరిచి వుండటం చూసి, దొంగతనం జరిగిందని భావించారు. వెంటనే ఆలయ ధర్మకర్త నూకా చెంగల్‌రెడ్డి, మన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారణ చేశారు. హుండీ దగ్గరలో వేసి ఉంటారని పలువురు గాలించారు. అయినా దొరకలేదు.

యువకుడి ఆత్మహత్యాయత్నం1
1/3

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం2
2/3

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం3
3/3

యువకుడి ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement