డేంజర్‌ మార్క్‌ దాటేసిన యమునా.. ఢిల్లీకి వార్నింగ్‌ బెల్‌ | Delhi Heavy Rains: Yamuna River Floods Latest News Updates | Sakshi
Sakshi News home page

డేంజర్‌ మార్క్‌ దాటేసిన యమునా.. ఢిల్లీకి వార్నింగ్‌ బెల్‌

Sep 2 2025 12:25 PM | Updated on Sep 2 2025 12:36 PM

Delhi Heavy Rains: Yamuna River Floods Latest News Updates

యమునా నది ఉగ్రరూపంతో.. దేశ రాజధాని పరిధిలోని పలు ఇళ్లలోకి మంగళవారం ఉదయం నీరు చేరింది. నది ప్రవాహం డేంజర్‌ మార్క్‌ దాటేయడం, ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో కొనసాగుతుండడంతో ఢిల్లీకి ముంపు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాలతో గురుగ్రామ్‌లోనూ జనజీవనం స్తంభించిపోగా, మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. హర్యానా హాథ్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి భారీగా వరద నీరు కిందకు విడుదల అవుతోంది. దీంతో.. రాజధాని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, హెచ్చరికలు జారీ చేశామని అధికారులు అంటున్నారు.  మరోవైపు షాదరా జిల్లాలో యమునా నదిపై ఉన్న లోహపుల్‌ వంతెన మీదుగా మంగళవారం సాయంత్రం రాకపోకలు పూర్తిగా బంద్‌ చేయనున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. 

 

 సోమవారం కురిసిన భారీ వర్షంతో గురుగ్రామ్‌ అతలాకుతలం అయ్యింది. గురుగ్రామ్‌ ట్రాఫిక్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని, అలాగే ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులు బాటు కల్పించాలని కంపెనీలకు అధికార వర్గాలు సూచించాయి.  రోడ్ల మీద భారీగా నీరు చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ద్వారాకా ఎక్స్‌ప్రెస్‌ వే సర్వీస్‌ లేన్‌పై భారీగా వరద నీరు చేరడంతో మూసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement