వీడని భారీ వర్షం.. ప్రైవేట్‌ కార్యాలయాలకూ సెలవు | Mumbai Rain Schools Colleges Closed Water Logging Traffic Latest | Sakshi
Sakshi News home page

ముంబైని వీడని భారీ వర్షం.. ప్రైవేట్‌ కార్యాలయాలకూ సెలవు

Aug 19 2025 11:02 AM | Updated on Aug 19 2025 11:46 AM

Mumbai Rain Schools Colleges Closed Water Logging Traffic Latest

ముంబై: రుతుపవనాల ఉధృతి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ పరిణామాలకు మహారాష్ట్ర అత్యంత ఘోరంగా దెబ్బతింది. ముంబైలో కేవలం ఎనిమిది గంటల్లో 177 మి.మీ వర్షపాతం నమోదైంది.
 

ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ మందగించింది. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమాన, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముంబై, థానే, పాల్ఘర్ నవీ ముంబైలలో భారీ వర్షాల దృష్ట్యా, ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

నగరంతో పాటు శివారు ప్రాంతాలలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఈరోజు(మంగళవారం) ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు.

నగరంలో భారీ వర్షాల మధ్య మెరైన్ డ్రైవ్‌లో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలో వర్షం కొనసాగుతోంది. గేట్‌వే ఆఫ్ ఇండియా  వద్ద నీరు నిలిచిపోయింది.

భారీ వర్షపాతం కారణంగా మిథి నది ప్రమాద  పరిధికి దగ్గరగా ప్రవహిస్తున్నది. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాంతంలో జలదిగ్బంధం ఏర్పడింది.

బాంద్రా ఖార్ లింక్ రోడ్  జలమయం అయ్యింది. చెంబూర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర జలదిగ్బంధం ఏర్పడింది.

పన్వేల్‌లోని అటల్ సేతు హైవేను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాసాయి-విరార్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement