
విశాఖ: కళింగపట్నం వద్ద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నెమ్మదిగా పారాదీప్-గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం బలహీనపడినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుగుతుందని వెల్లడించింది. ఫలితంగా రేపు కూడా పలు ప్రాంత్లాఓ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 55 కి.మీ నుంచి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.
కాగా, ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండ ప్రబావంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళ రాదని ఐఎండీ ముందుగానే హెచ్చరికలు పంపింది.
ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.
పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది.