నయా జోష్
ఏయూ క్యాంపస్: కాలం ఆగదు.. జ్ఞాపకాలు చెరిగిపోవు. 2025 నేర్పిన పాఠాలను, మిగిల్చిన తీపి గుర్తులను పదిలపరుచుకుంటూ.. విశాఖ నగరం 2026కి జై కొట్టింది. సమయం లేదు మిత్రమా.. అంటూ సాగర తీరపు అలల సాక్షిగా నగరవాసులు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గడిచిన కాలాన్ని వెనక్కి నెడుతూ, కొత్త ఆశలతో, రెట్టించిన ఉత్సాహంతో విశాఖ వాసులు నూతన అధ్యాయాన్ని ఆరంభించారు. కాగా.. బుధవారం సాయంత్రం నుంచే నగరం కొత్త రంగులు అద్దుకుంది. ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపించింది. బేకరీలు, స్వీట్ షాపులు, బొకే సెంటర్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఇక న్యూ ఇయర్ అంటేనే యూత్ జోష్.. నగరంలోని క్లబ్‌లు, బార్లలో సందడి తారస్థాయికి చేరింది. డీజే సౌండ్లు, లేజర్ లైట్ల వెలుగుల్లో యువత స్టెప్పులేస్తూ 2026కి రిచ్‌గా వెల్కమ్ చెప్పారు. స్టార్ హోటళ్లు, ఈవెంట్ వెన్యూలు అన్‌లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్‌తో దద్దరిల్లాయి. రూ.10 వేల నుంచి 20 వేల వరకు టికెట్లు ఉన్నా.. వెనకాడకుండా కపుల్స్, ఫ్యామిలీస్ క్యూ కట్టారు. మరోవైపు లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వైజాగ్ స్పెషల్ అట్రాక్షన్ బీచ్ రోడ్ జనసంద్రంగా మారింది. కేక్ కటింగ్స్, పరస్పర శుభాకాంక్షలతో సముద్ర తీరం హోరెత్తింది. సాగర తీరపు గాలుల్లో కొత్త సంవత్సర ఉత్సాహం ఉప్పొంగింది. కొత్త ఏడాదిలో అంతా శుభం జరగాలని కోరుకుంటూ గురువారం నగరవాసులు ఆలయాలను సందర్శించుకోనున్నారు. సింహాచలం, సంపత్ వినాయక, కనకమహాలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక పూజలకు అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు.
వీఎంఆర్‌డీఏ పార్కులో..
నయా జోష్
నయా జోష్
నయా జోష్
నయా జోష్
నయా జోష్


