
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న(శుక్రవారం) రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్‌పూర్‌లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది మృతిచెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
#दिल्ली के जैतपुर थाना इलाके में आज एक हादसा - लगभग 100 फुट लंबी दीवार गिर गई जिसकी चपेट में पास की कई झुग्गियां आ गई है। pic.twitter.com/FsEMHTY8o6
— Rohit Chaudhary (@rohitch131298) August 9, 2025