
రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల వరద ప్రవాహంలో గల్లంతైన నాగయ్య కుటుంబీకులను ఓదారుస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫల మైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని.. బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువా రం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించి జిల్లాలవారీగా వరద నష్టంపై ఆరా తీశారు.
జనజీవనం అస్తవ్యస్తంపై కేసీఆర్ ఆందోళన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం, జనజీవనం అస్తవ్యస్తం కావడంపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ఇళ్లు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలం కావడంపై దిగ్బ్రాంతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్‌ను ఆదేశించారు.