
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారిమళ్లించింది. కాచిగూడ-నిజామాబాద్, నిజామాబాద్-కాచిగూడ, కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి సర్వీసును రద్దు చేసినట్టు రైల్లే అధికారులు ప్రకటించారు.
మహబూబ్‌నగర్-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ సర్వీసును పాక్షింగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అక్కన్నపేట్ -మెదక్ రైల్వే ట్రాక్ పైనుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Bulletin 4 - SCR PR No. 357 Dt. 27.08.2025 on "Cancellations/Partial Cancellation/Diversion/Rescheduling of Trains Due to Heavy Rains@drmhyb @drmsecunderabad @drmned @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/8mqMmUO6UQ
— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025