
ఢిల్లీ: యమునా నది ప్రమాద స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. వరద నీరు బయటకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యమునా నది హోల్డింగ్ కెపాసిటీ పెంచామని ప్రభుత్వం వెల్లడించింది. యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న మురికివాడల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరో మూడు రోజులపాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అవసరముంటే తప్ప బయటకి రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో జలమయం కావడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. పాత రైల్వే వంతెనను మూసివేశారు.
#WATCH | Yamuna river continues to flow above the danger mark in Delhi; Visuals from Old Yamuna Bridge. pic.twitter.com/vypHTNP1Uo
— ANI (@ANI) September 3, 2025
బుధవారం మధ్యాహ్నం 1 గంటకు 207 మీటర్లు దాటి పోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. 1963 నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరు దశాబ్దాల్లో యమునా నది 207 మీటర్ల మార్క్‌ను దాటడం ఇది ఐదోసారి. 2023 (208.66 మీ), 2013 (207.32 మీ.), 2010 (207.11 మీ.), 1978 (207.49 మీ.) దాటి ప్రవహించింది.