
రెయిన్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, సరాసరి 10 నుంచి 15 సెం.మీ కంటే ఎక్కువ, కొన్ని చోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురవవచ్చని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయా రోజుల్లో వాహనాల కదలికలను తగ్గించాలని అభ్యర్థించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.