మోంథా తుపాన్ మొత్తానికి వాయుగుండంగా బలహీనపడింది. సాయంత్రం కల్లా దీని ప్రభావం పూర్తిగా పోతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో రాగల కొన్ని గంటల్లో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలే పడనున్నాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాగం అప్రమత్తమైంది.
తెలంగాణలో మోంథా ఎఫెక్ట్‌తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 35-45కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆరు జిల్లాలకు సెలవులు..
భారీ వర్షాల నేపథ్యంతో వరంగల్, సిద్ధిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరిక
జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
మోంథా ప్రభావం ఇలా..
మోంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. భద్రాచలానికి 120కి.మీ... ఖమ్మంకు 180 కి.మీ... ఒడిశా మల్కన్‌గిరికి 130 కి.మీ. వాయుగుండంగా కేంద్రీకృతమైంది. సాయంత్రం కల్లా పూర్తి బలహీనంగా మారిపోనుంది.
సీఎం సమీక్ష
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.


