
సాక్షి, విశాఖపట్నం: కర్నూలు, నంద్యాల, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రేపు(అక్టోబర్ 24, శుక్రవారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వచ్చే 24 గంటల్లో కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
యానాం, పల్నాడు ఏలూరు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కృష్ణా జిల్లా మచిలిపట్నం 11, యానాం 11 సెంటి మీటర్లు వర్షపాతం నమోదైంది. రాయలసీమలోలో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పోర్ట్ వార్నింగ్‌లు ఉపసంహరించుకుంది.
