breaking news
flash flood
-
వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!
వాషింగ్టన్: అమెరికా నైరుతి ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలను రానున్న రోజుల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అరిజోనా, న్యూ మెక్సికో, ఉటా, కొలరాడోలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల (సుమారు 30 సెం.మీ.) వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది సంభవిస్తే ‘1,000 ఏళ్లకు ఒకసారి’ చోటుచేసుకునే స్థాయి వర్షపాతంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో దాదాపు కోటి మంది అమెరికన్లు వరదల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వరద హెచ్చరికలను అమెరికా జాతీయ వాతావరణ శాఖ జారీ చేసింది. తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. గంటకు 2–3 అంగుళాల వర్షపాతం నమోదయ్యేంత తీవ్రత ఉండొచ్చని పేర్కొంది. స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ వాతావరణ నిపుణులు తెలిపారు. ఫీనిక్స్, టక్సన్ ప్రాంతాల్లో శుక్రవారం నాటికి 2–4 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే అరిజోనాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నెలకొంది. బుధవారం (సెప్టెంబర్ 16) టక్సన్‌లో అరగంట వ్యవధిలో మూడు అత్యవసర ఘటనలను అగ్నిమాపక సిబ్బంది పరిష్కరించారు. పాక్షికంగా నీటిలో మునిగిన కారుపై చిక్కుకున్న ఓ డ్రైవర్‌ను రక్షించారు. మరో వాహనదారుడు నార్త్ అలామో అవెన్యూ, ఈస్ట్ రోజ్‌వుడ్ స్ట్రీట్ వద్ద కారులో చిక్కుకోగా.. వరద నీటిలో కొట్టుకుపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించాయి. మరో వ్యక్తి గ్రాంట్ రోడ్, వ్యాట్ డ్రైవ్ సమీపంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సకాలంలో కాపాడారు.ఈ సమయంలో నైరుతి అమెరికాలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సాధారణమేనని అక్యూవెదర్ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతంలో గాలుల దిశ మారడంతో మెక్సికో, కాలిఫోర్నియా గల్ఫ్ నుంచి వేడి, తేమతో కూడిన గాలి ఉత్తర దిశగా వస్తుంది. తేమ పైకి ఎగసి ఉరుములతో కూడిన వర్షాలుగా మారుతుంది. కొలరాడో, న్యూ మెక్సికో, నెవాడాలోని కొన్ని ప్రాంతాలకు వర్షం అవసరమైనప్పటికీ.. ఆకస్మికంగా భారీ వర్షాలు కురిస్తే వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఇదే చివరి భారీ వర్షాల ఉద్ధృతి కావచ్చని, అయితే బలమైన ఎల్‌నినో పరిస్థితులు దీనిని మార్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు.. 76 కప్పుల టీ ఉచితం! -
హిమాలయాల్లో జలప్రళయం.. 160 మందికి పైగా మృతి
-
Shocking Video: ప్రాణాల కోసం పరుగులు.. నేపాల్ లో భయానక దృశ్యాలు..
-
నేపాల్ లో జల ప్రళయం.. చూస్తుండగానే మొత్తం మాయం.. కొట్టుకుపోతున్న ప్రజలు..
-
ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
షిమ్లా: ఓ పెళ్లి ఊరేగింపునకు ఆకస్మిక వరద అడ్డంకిగా మారింది. వరద నీటితో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పెళ్లి ఊరేగింపు మరో ప్రమాదకర మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఇంతలో ఓ స్థానిక యువకుడు వరుడిని తన వీపుపై ఎత్తుకుని సురక్షితంగా దాటించాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.హిమాచల్‌ప్రదేశ్‌లోని ఛంబా జిల్లాలో ఆకస్మిక వరదల తర్వాత ఈ ఘటన జరిగింది. సాధారణంగా సులభంగా దాటగలిగే వాగు ఒక్కసారిగా ఉద్ధృత ప్రవాహంగా మారడంతో పెళ్లి ఊరేగింపులోని సభ్యులు, స్థానికులు వాగుకు ఇరువైపులా చిక్కుకుపోయారు. నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో సురక్షితంగా దాటేందుకు మార్గం లేకపోయింది. వాగును దాటడం తీవ్ర సవాలుగా మారింది. ఆ సమయంలో ఓ స్థానిక యువకుడు ముందుకొచ్చాడు.వీడియోలో ఆ యువకుడు వరుడిని తన వీపుపై ఎత్తుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు కనిపించింది. సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుడు అతడిని గట్టిగా పట్టుకుని ఉండగా, ఆ యువకుడు బలమైన ప్రవాహాన్ని ఎదుర్కొంటూ ఆచితూచి అడుగులు వేస్తూ వరద నీటిని దాటాడు.యువకుడి ధైర్యానికి సంబంధించిన దృశ్యం వైరల్‌గా మారినప్పటికీ, ఈ ఘటన ఆ ప్రాంతంలో చాలాకాలంగా ఉన్న సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల సమయంలో వాగును దాటడం చాలా కష్టంగా మారుతుందని స్థానికులు పలుమార్లు వాగుపై వంతెన నిర్మించాలని కోరారు.శాశ్వత వంతెన లేకపోవడంతో వాగులో నీటి మట్టం పెరిగినప్పుడు స్థానికులకు పరిమితమైన మార్గాలే మిగులుతున్నాయి. సాధారణంగా సులభంగా దాటగలిగే మార్గం కూడా నీరు పెరిగినప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. పెళ్లి ఊరేగింపుకు ఎదురైన పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలిచింది. View this post on Instagram A post shared by Himachal (@himachal) -
AP: అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్ హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: కర్నూలు, నంద్యాల, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రేపు(అక్టోబర్ 24, శుక్రవారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వచ్చే 24 గంటల్లో కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.యానాం, పల్నాడు ఏలూరు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కృష్ణా జిల్లా మచిలిపట్నం 11, యానాం 11 సెంటి మీటర్లు వర్షపాతం నమోదైంది. రాయలసీమలోలో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పోర్ట్ వార్నింగ్‌లు ఉపసంహరించుకుంది. -
చైనాలో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి
బీజింగ్: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ -
అస్సాంలో వరదలు..ఐదుగురి మృతి
గువాహటి : ఒకపక్క కరోనా వైరస్, ఆఫ్రికన్ ఫ్లూతో ప్రజలు అల్లాడుతుంటే వరదల రూపంలో మరో పిడుగు పడినట్లయ్యింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది. రాష్ర్టంలోని నల్బరి, గోల్పారా, నాగావ్, హోజాయ్ సహా మరో మూడు జిల్లాలు ముంపునకు గురయ్యారు. దీంతో వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 3.81 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) తెలిపింది. వరదల కారణంగా ముఖ్యంగా గోల్పురా, హోజాయ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కాగా గురువారం ఈ రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అస్సాంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, దాని అనుబంధ ఉపనదుల్లో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. 356 గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో 3,880 మందిని 190 సహాయక శిబిరాలకు చేర్చినట్లు తెలిపారు. (జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం ) వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశించారు. వరద సమయంలో సత్వర ఉపశమనం, సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమీషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్న ఆయన బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలంతా కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. (ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ ) -
మెరుపు వరదలు, భూ పాతాలు, భూకంపం..
టోక్యో, జపాన్ : నాలుగు ద్వీపాల సమూహ దేశం జపాన్ను వరద, భూపాతాలు, భూకంపం వణికించాయి. జపాన్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 46 మంది మృతి చెందగా, 50 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతుల సంఖ్య భారీగా పెరిగా అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 100 సెంటీమీటర్లకు పైగా కురిసిన భారీ వర్షం కారణంగా పలుచోట్ల మెరుపు వరద సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో దాదాపు 5 మీటర్ల మేర నీరు నిల్చొంది. దీంతో రెస్క్యూ టీమ్‌ల సాయం కోసం ఆయా ప్రాంతాల వారు ఇళ్లపైకి ఎక్కారు. పరిస్థితి దారుణంగా ఉందని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి వర్గాన్ని ఆదేశించారు. హిరోషిమా, ఎహైమ్, ఒకయామా, క్యోటో తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటం వల్ల రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ జపాన్‌లోని 32 లక్షల మందిని ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదాలు జరిగాయి. మెట్రో రైలు పట్టాలు తప్పిన ఫొటో జపాన పరిస్థితికి అద్దం పడుతోంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అసలే మెరుపు వరదలు, భూ పాతాల ధాటికి కుదేలవుతున్న జపాన్‌పై శనివారం సాయంత్రం భూ కంపం విరుచుకుపడింది. రిక్టర్ స్కేలుపై భూ కంప తీవ్రత 6.0గా నమోదైంది. -
ఆకస్మిక వరదలు.. 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులో వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదల్లో 30 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. శనివారం రాత్రి సంభవించిన వరదల్లో ఓ మసీదుతో పాటు కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని చిత్రాల్ జిల్లా మేయర్ హుస్సేన్ వెల్లడించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో.. చిత్రాల్ నది వరద ఉధృతి పెరగటంతో ఈ ప్రమాదం జరిగినట్లు 'జిన్హువా' వెల్లడించింది. పారా మిలటరీ, విపత్తు సహాయక బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్నాయని హుస్సేన్ వెల్లడించారు.


