మూడు రోజుల పాటు భారీ వర్షాలు | Heavy rains for three days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Aug 16 2025 5:47 AM | Updated on Aug 16 2025 5:47 AM

Heavy rains for three days

కొనసాగుతున్న అల్పపీడనం

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళా­ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీ­దుగా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వా­తా­వరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ­చించారు. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 87.5 మి.మీ, వేపగుంటలో 74 మి.మీ, జియ్యమ్మవలసలో 67మి.మీ, కురుపాంలో 60మి.మీ వర్షపాతం నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement