నాడు ముంపు | - | Sakshi
Sakshi News home page

నాడు ముంపు

Dec 14 2025 6:55 AM | Updated on Dec 14 2025 6:55 AM

నాడు

నాడు ముంపు

8లో విశాఖ బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో పెట్టుబడులను ఆకర్షించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనేక విప్లవాత్మక ప్రాజెక్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇన్ఫోసిస్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంతో కార్యకలాపాలు ప్రారంభించగా.. ఆ దిశగా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు సన్నద్ధమవుతున్నట్లు టీసీఎస్‌ కూడా ప్రకటించింది. ఒబెరాయ్‌ హోటల్స్‌ అన్నవరంలో రిసార్టు మోడల్‌ హోటల్స్‌ ఏర్పాటు పనులను ప్రారంభించింది. క్రమంగా విశాఖ వైపు అన్ని వర్గాలూ అడుగులు వేశాయి.

న్యూస్‌రీల్‌

తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
నేడు హ్యాపీ

ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి

మహారాణిపేట: విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ ద్వారా తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఇంచార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం ప్రభుత్వ అతిథి గృహంలో శాసన సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విశాఖపై ప్రత్యేక అభిమానం ఉందని, శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలతో వీఈఆర్‌ ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. వచ్చే నెలలో వైజాగ్‌ బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తొమ్మిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేశామని, గూగుల్‌ రాకతో విశాఖ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వీఈఆర్‌ లక్ష్యం 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడమేనని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్‌ రాజు మాట్లాడుతూ 2031 నాటికి 135 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. సమావేశంలో ఏపీ గ్రోవర్స్‌ ఆయిల్స్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గండిబాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు.

సాక్షి, విశాఖపట్నం :

‘హుద్‌హుద్‌ వంటి తుపాన్లు పరంగా చూస్తే విశాఖపట్నం సునిశిత ప్రాంతం. ఇక్కడ రాజధాని అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం.’

‘సముద్ర మట్టాలు పెరుగుతుండటం వల్ల తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఉత్తర కోస్తా తీరం నుంచి 100 కి.మీ దూరంలో సముద్రంలో చీలిక ఉంది. సునామీ వస్తే క్షణాల్లో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సమయంలో చంద్రబాబు అండ్‌ కో కలిసి పచ్చపత్రికల సాయంతో విశాఖపట్నంపై చిమ్మిన విషం ఇది.

కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత..

విశాఖపట్నం మోస్ట్‌ హ్యాపియెస్ట్‌ సిటీ. అత్యంత సురక్షిత నగరం. ప్రపంచమంతా మెచ్చే నగరం అంటూ చంద్రబాబు వైజాగ్‌ భజన చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రెండు నాల్కల ధోరణే అవలంబిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. సీఎం కుర్చీలో కూర్చున్న ప్రతిసారీ వైజాగ్‌ ఆర్థిక రాజధాని అంటూ ఊదరగొట్టే ఆయన.. ఆ దిశగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా మాటమార్చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రమంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని భావించి.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అప్పుడే చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టుకున్నారు. రాజధానిగా విశాఖకు ఎలాంటి అవకాశాలు లేవని. తుపాన్లు, సముద్ర ముంపుతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ తన అనుయాయ పత్రికలు, ప్రసారమాధ్యమాల ద్వారా.. పార్టీ నాయకుల ద్వారా ప్రచార హోరు సాగించారు. విశాఖ అభివృద్ధి కాకుండా విశ్వప్రయత్నాలు చేశారు.

అప్పటి నుంచే విశాఖ వైపు అడుగులు

అధికారంలో రాగానే బాబు గారి ‘విశాఖ’ రంగు మారెనూ..

నాడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన వైఎస్‌ జగన్‌

ఆ సమయంలో విశాఖపై విషం చిమ్మిన టీడీపీ, జనసేన నేతలు

సముద్రం ముందుకొచ్చి మునిగిపోతుందంటూ విష ప్రచారం

భూకంపాల తీవ్రతా ఉందంటూ పచ్చరాతలు

అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ చుట్టూ ప్రదక్షిణలు

నగరం అత్యంత సురక్షితమంటూ హడావుడి చేస్తున్న చంద్రబాబు బ్యాచ్‌

నాడు ముంపు1
1/1

నాడు ముంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement