కోటి సంతకాల ఉద్యమానికి విశేష ఆదరణ
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో సామాన్య ప్రజ లు, మేథావులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ఇచ్చారని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు కొనియాడారు. సంతకాల సేకరణ పత్రాలను ఈ నెల 15న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి విజయవాడలోని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ పత్రాల ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’కు అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ నెల 15న ఉదయం 9.30 గంటలకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి సేకరించిన సంతకాల పత్రాలను వాహనంలో తరలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎస్‌ఈసీ సభ్యులు జియ్యాని శ్రీధర్, డాక్టర్ జహీర్ అహ్మద్, పిన్నమరాజు సతీష్ వర్మ, పోతిన హనుమంతురావు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథరెడ్డి , చెన్నాదాస్, గుడ్ల రమణిరెడ్డి, మంచ మల్లేశ్వరి, పల్లా దుర్గారావు, కార్పొరేటర్లు అల్లు శంకర్ రావు, అనిల్‌కుమార్‌రాజు, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్‌చంద్ర, పోతిన శ్రీనివాసరావు, మహంతి, ద్రోణంరాజు శ్రీవాస్తవ, జిల్లా పార్టీ కమిటీ, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, సునీల్ కుమార్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులకు ఉరుకూటి చందు, బోని శివరామకృష్ణ, భర్కత్ అలీ, కటికల కల్పన, సేనాపతి అప్పారావు, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీ ప్రసాద్, జీలకర్ర నాగేంద్ర, ప్రసాద్‌రావు, మార్కెండేయులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కేకే రాజు చిత్రంలో సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు


