Cyclone Montha: ఏపీని నిండా ముంచిన మోంథా | Andhra Pradesh Cyclone Montha October 29th Live News Updates In Telugu, Breaking News Headlines, Cyclone Videos | Sakshi
Sakshi News home page

Cyclone Montha Live Updates: తీరం దాటినా శాంతించని మోంథా!.. అప్‌డేట్స్‌

Oct 29 2025 6:49 AM | Updated on Oct 29 2025 9:25 AM

Cyclone Montha On AP Oct 29 News Updates

AP Cyclone Montha Live News Updates Telugu: ఆంధ్రప్రదేశ్‌ తీరం సైక్లోన్‌ మోంథా ధాటికి తల్లడిల్లిపోయింది. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటి.. తీవ్ర తుపాన్‌ కాస్త తుపానుగా మారిపోయి తన ప్రభావం కొనసాగిస్తోంది. రాకాసి అలలు ఎగసిపడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే కోస్తాంధ్రలో ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టిస్తుండగా.. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మోంథా ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల పరిధిలో  విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.

రైతులకు కన్నీళ్లు మిగిల్చిన మోంథా

  • ఏపీలో పంటలపై మోంథా తుపాను ప్రభావం

  • నేలకొరిగిన వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలు

  • కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నీట మునిగిన పంట!
     

శ్రీశైలం పాతాళ గంగ వద్ద తప్పిన ప్రమాదం

  • శ్రీశైలంలో తప్పిన ఘోర ప్రమాదం

  • పాతాళ గంగ విరిగిపడ్డ కొండచరియలు

  • మూడు తాత్కాలిక దుకాణాలు ధ్వంసం

  • భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
     

మరో 24 గంటలు వర్షాలే!

  • మోంథాపై భారత వాతావరణ శాఖ(IMD) తాజా ప్రకటన

  • ఛత్తీస్‌గడ్‌ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి బలహీనపడిపోతుంది

  • మోంథా ప్రభావంతో గంటకు 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులు

  • ఏపీ, తెలంగాణ తోపాటు దక్షిణ ఒడిషా తీర ప్రాంతాలకు మరో 24 గంటలు వర్షాలే

  • వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

క్రమంగా బలహీనపడుతున్న మోంథా

  • క్రమంగా బలహీనపడుతున్న సైక్లోన్‌ మోంథా
  • ఇప్పటికే ఈ తీవ్ర తుపాను.. తుపానుగా బలహీనపడింది
  • రానున్న 4 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం
  • ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం

విమాన సర్వీసుల పునరుద్ధరణ

  • మోంథా కారణంగా నిన్న నిలిచిపోయిన 56 సర్వీసులు
  • ఇవాళ విశాఖ-విజయవాడ ఇండిగో సర్వీసు మాత్రమే రద్దు
  • మిగతావి యధాతథం

ఇంకా భయం గుప్పిట యానాం

  • యానాంలో తుపాను ప్రభావం
  • 24 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
  • ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి
  • భారీ ఈదురుగాలులు ప్రవాహంతో కుప్పకూలిన 20 వృక్షాలు
  • సముద్రపు అలలు తలిపించేలా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి
  • నిన్న మధ్యాహ్నం నుంచే వ్యాపార సముదాయాలు మూసివేత
  • ఈదురు గాలులు ప్రభావంతో బయటకి రాని యానాం ప్రజలు

అనకాపల్లి జిల్లాలో.. 

  • మాడుగుల. పెద్దేరు రైవాడ జలాశయాలకు వరద ఉధృతి.
  • ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలాశయాలకు చేరిక.
  • పెద్దేరు జలాశయం నుంచి 750 న్యూ సెక్యుల నీరు విడుదల.
  • తమతబ్బ వంతెనపై నుంచి కొనసాగుతున్న ప్రవాహం.
  • తమతబ్బ చింతలపూడి పంచాయతీల్లో 12 గ్రామాల రాకపోకలకు అంతరాయం.
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశం.

తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాల్లో.. 

  • మోంథా తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా కురస్తున్న వర్షాలు

కాకినాడలో.. 

  • మోంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తొండంగి, ఉప్పాడ మండలాల పరిధిలో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
  • నిన్న ఉదయం నుండి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • కొనసాగుతున్న పునరుద్దరణ పనులు

తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో.. 

  • మహబూబాబాద్, ఇనుగుర్తి కేసముద్రం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షం
  • డోర్నకల్ నియోజక వర్గ వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షం

ప్రకాశం జిల్లాలో.. 

  • ఒంగోలు నవోదయ స్కూల్ లోకి భారీగా చేరిన నీరు
  • క్యాంటీన్ లోకి సైతం వర్షపు నీరు రావడంతో వంట కు ఇబ్బందిగా మారింది సిబ్బంది
  • విద్యార్థులు కు ఆహారం ఇవ్వాలా వండడం కష్టం అంటున్న సిబ్బంది

ఎన్టీఆర్ జిల్లాలో.. 

  • కొనసాగుతున్న మోంథా తుఫాన్ ప్రభావం
  • తిరువూరులో భారీ వర్షం
  • భారీ వర్షం కారణంగా చెరువును తలపిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, రోడ్లు
  • ఇబ్రహీంపట్నంలో భారీగా వీస్తున్న ఈదురుగాలులు
  • విజయవాడ సిటీలో ఈదురు గాలులతో కురుస్తున్న మోస్తరు వర్షం
  • నందిగామలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • నందిగామ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • రోడ్ల పై భారీగా నిలిచిన వర్షపు నీరు

పార్వతీపురం మన్యం జిల్లాలో.. 

  • తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పూరి ఇల్లు పాక్షికంగా ధ్వంసం.
  • గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వానలకు 118.70 హెక్టార్ల లో వ్యవసాయ పంటలకు నష్టం.
  • జిల్లా కలెక్టర్ కార్యాలయం నివేదిక

నెల్లూరు జిల్లాలో..

  • సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదం
  • పెన్నా నది నుండి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన  మూడు పడవలు
  • భారీగా నీరు రావడంతో తాళ్ళు తెంచుకొని పెన్నా నది గట్టున నిలిచిన  బోట్లు
  • పెన్నా వారధి  గేట్లకు కు తగలకపోవడంతో ఊపిరిపించుకున్న అధికారులు

కృష్ణా జిల్లాలో..

  • మోంథా తుఫాన్ ప్రభావంతో గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
  • భారీ ఈదురు గాలులకు బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేలకొరిగిన వరి పంట

నల్లగొండ జిల్లాలో..

  • వర్షం నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు

విశాఖపట్నంలో.. 

  • తుఫాన్ తీరం దాటిన విశాఖలో కొనసాగుతున్న ఈదురు గాలులు.
  • ఇంకా అల్లకల్లోలంగా సముద్రం.
  • మత్స్యకారులు మరో మూడు రోజులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు.
  • ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు స్కూలుకు సెలవు.
  • భారీ గాలులకు అనకాపల్లి నేషనల్ హైవే పై కూలిని చెట్టు.
  • ఈదురు గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై పడ్డ చెట్టు.
  • అనకాపల్లి జిల్లాలో పంట మునిగిన పొలాలు..
  • ఈరోజు భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.
  • ఈరోజు బీచ్, పర్యాటక ప్రాంతాలకు  అనుమతి నిరాకరణ
     

నెల్లూరు జిల్లాలో..

  • ఎగువ  ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయంకు వరద ప్రవాహం.
  • జలాశయం ఇన్ ఫ్లో 40,784 క్యూసిక్కులు..
  • జలాశయం అవుట్ ఫ్లో 33,460 క్యూసిక్కులు..
  • జలాశయం ప్రస్తుతం నీటి సామర్థ్యం 67.647 టీఎంసీలు..
  • జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు
     

అనకాపల్లిలో..

  • గాలులకు అనకాపల్లి హైవే కూలిన భారీ వృక్షం
  • తొలగించిన ఫైర్ సిబ్బంది

తిరుపతిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!

  • తిరుపతి జిల్లాలో ఇవాళ తెరుచుకోనున్న విద్యాసంస్థలు 
  • అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈరోజు నుండి యథావిధిగా పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు
  • మోంథా ప్రభావంతో తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ

ప్రకాశం జిల్లాలో.. 

  • మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా అతలాకుతలం
  • భారీ వర్షాల ఈదురు గాలులతో చిగురుటాకుల వణికిన ఉమ్మడి ప్రకాశం జిల్లా
  • పొంగిపొల్లిన వాగు లు, వంకలు
  • నిండు కుండాలా తయారైన పలు చెరువులు
  • పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
  • రహదారులపై వాగులు పొంగిన చోట పోలీస్ పికెటింగ్
  • కందుకూరులో ఎర్రవాగు ఉగ్రరూపం.
  • రాళ్లపాడు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు
  • సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటిమనక
  • కూచిపూడి చెరువుకు గండి భారీగా గ్రామం మీద పడ్డ వరదనీరు
  • కొండేపి వద్ద పొంగిపొర్లను అట్లేరు
  • కొండేపి ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం
  • ఒంగోలు ఎర్రజర్ల మధ్య పొంగిపొర్లిన నల్లవాగు
  • ఒంగోలు ఎర్రజర్ల మధ్య నిలిచిన రాకపోకలు
  • అదే ప్రాంతంలో నిన్న కొట్టుకుపోయిన
  • ఒక కారు కనిగిరిలో సరిగా వర్షం
  • పోటెత్తిన భైరవకోన జలపాతం

 

 

  • ఒంగోలు పొదిలి మధ్య వర్షం దాటికి దెబ్బతిన్న రహదారి
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • ఒంగోలులో పల్చోట్ల కాలనీలు జలమయం
  • ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు, ట్రంక్ రోడ్లో సైతం భారీగా నిలిచిన వర్షపు నీరు
  • శివారు  కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు
  • తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం ఈదురు గాలులు
  • పునరావాస కేంద్రాలకు పలువురు తరలింపు
  • మార్కాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది
  • మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం- కొండేపల్లి మార్కాపురం -నాగులవరం గ్రామాల మధ్య రాకపోకలకు బంద్
  • జిల్లాలో భారీగా నష్టపోయిన మిర్చి మొక్కజొన్న కంది మినుము సజ పంట రైతులు
  • పుల్లలచెరువు మండలం చౌటపచర్ల చెరువుకు గండి వంద ఎకరాలలో ఉరి మొక్కజొన్న పంట నష్టం
  • దర్శి మండలం వెంకటాచలపల్లి వద్ద పొంగిపొర్లుతున్న పులి వాగు
  • కొట్టుకుపోయిన రోడ్లు
  • గ్రామ శివారులో ఉన్న గుడిలో రోడ్డు కొట్టుకుపోవడంతో అక్కడ ఇరుక్కుపోయిన 30 మంది స్వాములు
  • చీరాలలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం  
  • అర్ధవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు
  • ఉప్పొంగిన జంపలేరు వాగు
  • బొల్లు పల్లె అచ్చంపేటకు రాకపోకలు బంద్
  • భారీ వర్షాల కారణంగా నిన్నటి నుంచి దోర్నాల శ్రీశైలం మధ్య నిలిచిన రాకపోకలు
  • గుండ్లకమ్మ రిజర్వాయర్కు భారీగా వరద నీరు
     

ఏపీని నిండా ముంచిన మోంథా

  • మోంథా తుపానుతో ఏపీకి తీవ్ర నష్టం

  • ఓవైపు భీకరగాలులు.. మరోవైపు భారీ వర్షాలు

  • విరిగిన స్థంభాలు, నేలకొరిగిన వృక్షాలు

  • పొంగిపొర్లుతున్న వాగులు

  • రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకూ అంతరాయం

  • లోతట్టు ప్రాంతాల జలమయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • 20 గంటలుగా అంధకారంలోనే పలు ప్రాంతాలు

  • సెల్‌ టవర్లు దెబ్బ తినడంతో పని చేయని సెల్‌ఫోన్‌ సేవలు

  • తీవ్రంగా దెబ్బ తిన్న పంటలు

  • ఐదు రోజులుగా వేటకు దూరమైన మత్య్సకారులు

  • మోంథా ప్రభావంతో ఈ నెల 31 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన పలు జిల్లా కలెక్టర్లు

క్రమంగా బలహీనపడుతున్న మొంథా

  • తీవ్ర తుపాను ప్రస్తుతం తుపానుగా బలహీనపడ్డ మోంథా
  • రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం
  • దీని ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • కోస్తాంధ్రలో ఈదురుగాలులు
  • ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
  • ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు
  • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం
  • నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్‌

  • మెంథా ఎఫెక్ట్‌తో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌
  • ఆరు జిల్లాలకు ఆరెంజ్‌, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
  • భద్రాద్రి, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • హైదరాబాద్‌, జనగాం, గద్వాల, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి.. ఆరెంజ్‌ అలర్ట్‌

కృష్ణా జిల్లా..

  • దివి సీమలో మోంథా తుఫాన్ ప్రభావంతో కొనసాగుతున్న ఈదురు గాలులు
  • నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
  • అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలుల కారణంగా విద్యుత్ పునఃరుద్ధరణకు అంతరాయం
  • గాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్‌ను పునఃరుద్ధరించే అవకాశం

తెలంగాణ ఖమ్మం జిల్లాలో.. 

  • తెలంగాణపై మోంథా ప్రభావం
  • పలు జిల్లాలకు వర్ష సూచన
  • మొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్

తెలంగాణ వికారాబాద్ జిల్లాలో.. 

  • మోంథా ఎఫెక్ట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • పూడూరు లో 6.1 cm
  • మోమిన్ పేట లో 6 cm
  • ధారూర్ లో 4.6cm
  • పరిగిలో 4.5cm

కిరండోల్‌ రైల్వే లైన్‌ ధ్వంసం

  • మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు 
  • వాల్తేరు రైల్వే డివిజన్‌లో కొత్తవలస-కిరండోల్‌ సింగిల్‌ రైల్వే లైన్‌ ధ్వంసం 
  • అరకు రైల్వే టన్నెల్‌ నెంబర్‌ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్‌ పూర్తిగా ధ్వంసం 
  • ట్రాక్‌పై చేరిన మట్టి, బండరాళ్లు 
  • వరద నీరు నిలవకుండా ఏర్పాట్లు చేసిన సిబ్బంది

ఎన్టీఆర్ జిల్లాలో..

  • తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం
  • నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారి
  • పలు లోతట్టు ప్రాంతాలు జలమయం

కృష్ణా జిల్లాలో.. 

  • ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ కాకాని నగర్ లో మూడు రేకుల షెడ్లు ఇళ్ల పై పడిన చెట్లు.
  • పూర్తిగా ధ్వంసం అయిన ఒక ఇల్లు,
  • పాక్షికంగా మరో రెండు ఇల్లు ధ్వంసం.
  • సహాయ చర్యలు చేపట్టిన అధికారులు

నంద్యాల జిల్లాలో..

  • మోంథా తుఫాన్ కారణంగా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • నల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భవనాసివాగు కు చేరుతున్న వరద నీరు.ఉప్పొంగిన వక్కిలేరు, భవనాసి వాగులు..
  • ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగుపొంగి పొర్లుతుండడంతో సుమారు 22గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • జలదిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం.
  • కర్నూలు -గుంటూరు జాతీయ రహదారిపై మోకాలికి పైగా పారుతున్న వర్షపు నీరు..
  • వెలుగోడు మండలంలోని మాధవరం వద్ద పొంగిపొర్లుతున్న గాలేరు వాగు, సుమారు 8 గ్రామాలకు నిలిచిపోయిన ప్రజా రవాణా సంబంధాలు
  • లోతట్టు కాలనీలు జలమయం, నిద్రాహారాలు మాని అవస్థలు పడుతున్న ప్రజలు..

విశాఖపట్నంలో..

  • విశాఖ నగరం పై కొనసాగుతున్న తుఫాన్ ప్రభావం. .
  • నిన్న రాత్రి విశాఖలో భారీగా ఈదురు గాలులు
  • గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై కూలిన భారీ వృక్షం.
  • తూటిలో తప్పిన ప్రమాదం
  • పాక్షికంగా ఇల్లు ద్వసం.
  • చెట్టును తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది.
  • జోన్ 3 లో ఇప్పటివరకు పడిన 72 నుండి చెట్లును తొలగించిన అధికారులు

విజయవాడలో.. 

  • మోంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం

గుంటూరులో.. 

  • గుంటూరు జిల్లాలో భారీ వర్షం
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • గుంటూరులో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
  • నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయం
  • పొంగిపొర్లుతున్న ట్రైన్లు
  • బ్రాడీపేట ,అరండల్ పేట, మహిళా కాలేజ్, గుజ్జునుకుంట్ల, ఏటి అగ్రహారంతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం
  • RUB తోపాటు 3 వంతెన కిందకు భారీ స్థాయిలో వర్షపునీరు

భారీ వర్షాలు ఎక్కడంటే..

  • శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
  • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

Cyclone Montha Slams AP Coast Photos13

కోనసీమ జిల్లా..

  • అంతర్వేది పాలెం వద్ద తీరం దాటిన మోంథా తుఫాన్
  • తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు
  • కోనసీమలో భారీగా కూలిన చెట్లు
  • పలుచోట్ల ధ్వంసమైన విద్యుత్ లైన్లు
  • రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కోవడంతో నిలిచిపోతున్న రాకపోకలు
  • పలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు
  • జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
  • పెద్ద సంఖ్యలో కూలిన కొబ్బరి చెట్లు
  • తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈదురు గాలులు
  • అంతర్వేది, ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రం
  • ఎగసిపడుతున్న అలలు

విజయవాడ..

  • ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి దంచికొడుతోన్న భారీ వర్షం
  • పలుచోట్ల అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేత
  • విజయవాడలో భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ఆర్టీసీ బస్టాండ్ వద్ద సబ్ వేలోకి చేరిన వర్షపు నీరు
  • సబ్ వే వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు పెట్టిన పోలీసులు
  • కనకదుర్గ ఫ్లై ఓవర్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత

విజయవాడ..

  • ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద
  • ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 82,675 క్యూసెక్కులు
  • వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల
  • కాలువలకు పూర్తిగా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు

 

  • మోంథా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షం కురిసింది. 

  • మోంథా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.  పలు చోట్ల విద్యుత్‌ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై రాత్రంతా వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేశారు. 

  • మచిలీపట్నంలో.. తుపాను ధాటికి మచిలీపట్నంలో విద్యుత్‌ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

  • నెల్లూరు, బోగూరులో తుపాను ధాటికి గుడిసెలు కుప్పకూఇపోయి ప్రజలు గజగజ వణికిపోయారు

  • ప్రకాశంలో.. 10 అడుగుల మేర అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది

  • పలు జిల్లాలోనూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి రాత్రంతా ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి. 

  • తీవ్ర తుపాన్‌గా తీరం దాటే  కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకొచ్చింది. మామిడికుదురు మండలం కరవాక, గొగన్నమఠం దగ్గరా ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

  • తుపాన్‌ ప్రభావంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖ.. ఇలా 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాల ఉంటాయంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement