సాక్షి చెన్నై: తమిళనాడు ఆవనీయపురంలో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో అపశ్రుతి చోటు చేసుకుంది. జల్లికట్టు సాగుతుండగా ఉన్నట్టుండి ఎద్దులన్నీ ఆటను వీక్షిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చాయి అక్కడున్న ప్రజలపై దాడి చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా తీవ్రగాయాలు కాగా అందులో 10 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పోటీలలో 600కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 1000కి పైగా ఎద్దులు ఈ పోటీలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.


