ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో.. | Sakshi
Sakshi News home page

ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..

Published Mon, May 27 2024 12:57 PM

This 84-YO Tamil Nadu Grandmother Sells Idlis For Just Rs 2

ఏ వ్యాపారం అయినా లాభం కోసమే చేస్తుంటారు. మరికొందరూ ఆ క్రమంలో మోసాలతో లాభాలు ఆర్జించే యత్నం చేస్తుంటార. కొందరూ నిస్వార్థంగా వ్యాపారం చేస్తూ..కస్టమర్ల ప్రేమ ఆప్యాయతలను చూరగొంటారు. వారి అండదండలతో ముందుకు సాగిపోతారు. తన వద్దకు వచ్చే కస్టమర్‌ కడుపు నిండి సంతోషంగా ఫీలైతే చాలు అని భావించే వ్యాపారుల ఉండటం అరుదు. అలాంటి కోవకు చెందిందే ఈ 84 ఏళ్ల బామ్మ.

తమిళనాడుకి చెందిన  ధనం పాటి బామ్మ ఎనిమిది పదులు వయసులోనూ కాయకష్టం చేసుకుని బతుకుతుంది. ఆమె ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుత కాలంలో పప్పులు, ఉప్పులు ధరలు ఆకాశనంటేలా ఉన్నాయి. అయినా సరే ఈ బామ్మ చాలా చీప్‌ ధరకే ఇడ్లీలను విక్రయిస్తుంది. అలా అని ఆమె వెల్‌సెటిల్‌డ్‌ కుటుంబం కూడా కాద. చాలా నిరుపేద కుటుంబం. చాల కష్టపడి బతుక పోరాటం సాగిస్తోంది. ఆ బామ్మకు ఇద్దరు పిల్లలు. కూతురుని టెలర్‌కిచ్చి పెళ్లి చేశానని, కొడుకు లారీ లోడ్‌మ్యాన్‌గా పనిచేస్తాడని చెప్పింది. కొడుకు తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలిపింది. 

వాళ్లు తనతో ఉండమని చెప్పారు,కానీ ఎందుకు వాళ్లకు భారంగా ఉండటమని వెళ్లలేదని చెప్పింది. పైగా తన చివరి  శ్వాస వరకు ఇలా కష్టపడతానని అంటోంది. అయితే ఆమె ఈ వ్యాపారం తన భర్త అనారోగ్యానికి గురైనప్పటి నుంచి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తన భర్త మొదట్లో టీ వ్యాపారం చేసేవాడని, ఆ డబ్బులు సరిపోక ఇలా టిఫిన్‌ సెంటర్‌ పెట్టామని చెప్పింది. అయితే ఆమెకు ఉన్న కొద్దిపాటి చిన్న ఇంటిలోనే ఇడ్లీలను విక్రయించుకుంటోంది. స్కూల్‌ పిల్లలు, కార్మికులు, రోజువారీ కూలీలు ఆమె కస్టమర్లు. ఆమె గత నాలుగేళ్ల క్రితం వరకు ఒక్క రూపాయికే ఇడ్లీలను విక్రయించేది. 

ఇటీవలే ఆర్థిక అవరసరాల రీత్య రూ. 3లకు విక్రయిస్తుంది. ఇది కూడా భర్త చనిపోవడంతోనే ఇడ్లీ ధర పెంచింది. ఇంకాస్త ధర పెంచొచ్చు కదా..! అని ఎవ్వరైనా అడిగితే ప్రజలు రూ. 10లకే కడుపు నిండా టిఫిన్‌ తినాలని అంటుంది. ఈ బామ్మ స్వతం అవసరాలు ఎన్ని ఉన్నా.. కస్టమర్లకు మాత్రం కడుపునిండా తక్కువ ధరకే టిఫిన్‌ పెడుతుందని, మూడు ఇడ్లీలు అడిగితే ఇంకో రెండు ఇడ్లీలు  ఛార్జీ లేకుండానే పెడుతుందని స్థానిక కస్టమర్లు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకే ధనం పాటి బామ్మ అమ్మడానికి మరో కారణం..రేషన్‌ బియ్యం, పప్పులతోనే ఈ  ఇడ్లీలను తయారు చేస్తుంది. పైగా ఆమె వద్దకు వచ్చిన కస్టమర్లే ప్రేమతో ఆ బియ్యం, పప్పులు ఉచితంగా ఇవ్వడంతో ఇలా తక్కువ ధరకే విక్రయిస్తుంది ఈ బామ్మ. 

పైగా తన వద్దకు వచ్చే వాళ్లు తనపై చూపించే ప్రేమ ఆప్యాయలతో కాలం వెళ్లదీయగలుగుతున్నానని చెబుతుంది. రెస్ట్‌ తీసుకోవాల్సిన ఈ వయసులో కష్టపడటమే గాకుండా పిల్లలపై ఆధారపడేందుకు ఇష్టపడలేదు. తన శ్రమనే నమ్ముకుని జీవితాన్ని వెళ్లదీస్తోంది. కటిక దారిద్యం అనుభవిస్తున్నా.. కూడా నిజాయితీగా తక్కువ ధరకే రుచికరమైన ఇడ్లీల విక్రయిస్తూ జీవనం సాగించడం అంటే మాములు విషయం కాదుకదా..!. కొద్ది కష్టాలకి భయపడే మనకు.. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నబామ్మను చూస్తే..హ్యాట్సాఫ్‌ బామ్మ..! అని అనుకుండా ఉండలేం!.

(చదవండి: సూపర్‌ బామ్మ!.. 71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్‌ లైసెన్స్‌ల..!)

 

Advertisement
 
Advertisement
 
Advertisement