
పుష్ప క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మేనరిజానికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. పుష్పరాజ్కు ఉన్న క్రేజ్తో తాజాగా వినాయక చవితికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని హోసూరుకు చెందిన ఫ్యాన్స్ పుష్ప మూవీ సెట్ తరహాలో ఏర్పాటు చేశారు. ఎర్రచందనం దుంగల సెటప్తో అచ్చం పుష్ప స్టైల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఈ పుష్ప స్టైల్లో ఉన్న వినాయక విగ్రహాలను చూసేందుకు అభిమానులే కాదు.. భక్తులు కూడా పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ వినాయక చవితి రోజున పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశారు. ఫైనల్గా దర్శనం పూర్తయిందని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహాలను దర్శించుకునేందుకు వచ్చినవారిలో మహిళ అభిమానులు, భక్తులు కూడా ఉన్నారు. ఇది చూసిన పుష్పరాజ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Finally Darshanam Completed 👍 pic.twitter.com/QYYjb9PpKM
— Chennai Murug🅰️🅰️n (@ChennaiMurugAAn) August 28, 2025