క్రికెట్‌ లవర్స్‌ ఆహ్వాన పత్రిక వైరల్‌: సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఫిదా!   | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ లవర్స్‌ ఆహ్వాన పత్రిక వైరల్‌: సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఫిదా!  

Published Fri, Apr 19 2024 5:22 PM

 IPL 2024 Chennai Super Kings Fan CSK Theme Wedding Card goes Viral - Sakshi

ఒక పక్క ఐపీఎల్‌ ఫీవర్‌ జోరుగా నడుస్తోంది. మరోపక్క రుతురాజ్ గైక్వాడ్‌ నేతృత్వంలోని ఐపీఎల్‌ జట్టు  చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు  దూసుకు పోయింది.  ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్‌లో ఇలా వచ్చి అలా సిక్సర్ల వర్షం కురిపించిన జట్టు మాజీ  కెప్టెన్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ మేనియా ఫ్యాన్స్‌ను ఆనందో త్సాహాల్లో తేలి యాడించింది. స్టేడియం అంతా రికార్డ్‌ స్థాయిలో హోరెత్తిపోయింది. ఈ క్రమంలో తాజాగా  సీఎస్‌కే అభిమాని పెళ్లి ప‌త్రిక నెట్టింట వైరల్‌గా మారింది.  సీఎస్‌కే ఫ్యాన్స్‌  ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌ చేసిన ఈ పెళ్లి పత్రిక  క్రికెట్‌ ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించింది.

త‌మిళ‌నాడుకు చెందిన జంట చెన్నై సూప‌ర్ కింగ్స్ థీమ్‌తో తమ పెళ్లి ఆహ్వాన ప‌త్రిక‌ రూపొందించడం విశేషంగా నిలిచింది. క్రియేటివ్‌గా సీఎస్‌కే లోగోను ఉప‌యోగించి వారి పేర్ల‌ను ముద్రించారు. అలాగే మ్యాచ్ న‌మూనా టికెట్‌పై పెళ్లి స‌మ‌యం(ఏప్రిల్‌ 17), రిసెప్ష‌న్ వంటి వివ‌రాల‌ను కూడా పొందుపర్చారు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్‌)

అంతేనా మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్ష‌న్  లాంటి ప‌దాల‌ను కూడా జోడించారు. అంతేకాదు సీఎస్‌కే ఐపీఎల్‌ను ఐదుసార్లు గెల్చుకున్న దానికి సూచికగా 5 స్టార్లను అందించడం మరో విశేషం.  దాంతో ప్ర‌స్తుతం ఈ వివాహ ఆహ్వాన ప‌త్రిక సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.  నూతన దంపతులు గిఫ్ట్లీన్ పెర్సీ,  మార్టిన్ రాబర్ట్ హృదయ పూర్వక శుభాకాంక్షాల వెల్లువ కురుస్తోంది.ఫెంటాస్టిక్‌ పార్టనర్‌షిప్‌ అంటూ  కమెంట్స్‌  చేయడం విశేషం. (యూట్యూబర్‌ ఓవర్‌ యాక్షన్‌.. దిమ్మతిరిగే షాక్‌!)

స్టార్‌ స్పోర్ట్స్‌  
ఈ పోస్ట్‌పై స్టార్‌  స్పోర్ట్స్‌  ఇండియా కూడా కమెంట్‌ చేయడం విశేషం.  మీ అభిమానంలాగే మీ జోడి కూడా బలంగా ఉండాలంటూవిషెస్‌ తెలిపింది. 

కాగా ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లు గెలిచి  ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. (ముఖేష్‌ అంబానీ: ఏ వర్కౌట్స్‌ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?)

Advertisement
Advertisement