బ్యాచ్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత వెలవన్‌ | Batch Squash Open Winner India Velavan Senthilkumar | Sakshi
Sakshi News home page

బ్యాచ్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత వెలవన్‌

Apr 30 2024 8:41 AM | Updated on Apr 30 2024 8:41 AM

Batch Squash Open Winner India Velavan Senthilkumar

పారిస్‌: భారత స్క్వాష్‌ ప్లేయర్‌ వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ తన కెరీర్‌లో ఎనిమిదో ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) టైటిల్‌ను సాధించాడు. పారిస్‌లో జరిగిన బ్యాచ్‌ ఓపెన్‌ చాలెంజర్‌ టోర్నీలో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల వెలవన్‌ విజేతగా నిలిచాడు.

ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్‌ వెలవన్‌ 11–6, 11–9, 11–6తో మెల్విల్‌ సియానిమానికో (ఫ్రాన్స్‌)పై గెలుపొంది ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాలుగు టోర్నీలలో పాల్గొన్న వెలవన్‌ రెండింటిలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరి, మరో రెండింటిలో రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement