
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
వైద్యశిబిరం
సీఎం వైద్య శిబిరాలను గురువారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిశీలించారు. ఆలందూరులో జరిగిన శిబిరంలో ఆయన బీపీ పరీక్షలు చేయించుకున్నారు. సాక్షి, చైన్నె
సముద్ర వర్తకం
సముద్ర వర్తకాన్ని ప్రోత్సహించే విధంగా బ్లూ ఎకనామిక్ కాన్ఫరెన్స్ – 2025 చైన్నె లో జరిగింది. ఇందులో చిన్న ఓడరేవుల శాఖ మంత్రి ఎ.వి.వేలును చైన్నె కామరాజర్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ సునీల్ పాలీవాల్ సత్కరించారు. ఇందులో రాష్ట్రంలో సముద్ర తీర వర్తకం, రవాణ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సాక్షి, చైన్నె
హత్య కేసులో జీవిత ఖైదు
అన్నానగర్: పూర్వీకుల ఇంటిని తన పేరుకు మార్చలేదని తల్లిని దారుణంగా హత్య చేసిన కుమారుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. నైల్లె జిల్లాలోని కుడంకుళం సమీపంలోని సెట్టిక్కులంలోని అయ్యప్పన్ నగర్‌లో రాజన్ (41). ఇతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇతని పూర్వీకుల ఇల్లు అదే ప్రాంతంలోని సెట్టిక్కులంలో ఉంది. ఇతని తల్లి జయమణి (60) అక్కడే నివసిస్తుంది. రాజన్ చిన్నతనంలోనే తండ్రి రాజమణి మృతిచెందాడు. రాజన్ తల్లిని పూర్వీకుల ఇంటిని తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో, మే 7, 2020న తల్లిని రాజన్ పొడిచి చంపాడు. నైల్లె మహిళా కోర్టులో జరిగిన ఈ కేసులో, న్యాయమూర్తి రామలింగం గురువారం తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో రాజన్‌న్‌కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
లారీని ఢీకొన్న బస్సు
●కండక్టర్ దుర్మరణం ●30 మందికి గాయాలు
తిరువొత్తియూరు: పొల్లాచి సమీపంలో ఆగిఉన్న లారీని, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కండక్టర్ దుర్మరణం చెందాడు. 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కోయంబత్తూరు నుంచి దిండుగల్‌కు ప్రభుత్వ బస్సు గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సును దిండుగల్‌కు చెందిన డ్రైవర్ కాశీరాజన్ నడుపుతున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు పొల్లాచి–కోయంబత్తూరు రోడ్డు ఆచ్చిపట్టి ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగిఉన్న ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ బాలసుబ్రమణి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పొల్లాచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,213 మంది స్వామివారిని దర్శించుకోగా 29,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందు వెళితే భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.