నేడు 3 మండలాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

నేడు 3 మండలాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత

Sep 12 2025 6:19 AM | Updated on Sep 12 2025 3:01 PM

తిరువొత్తియూరు: చైన్నె మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై ,మురుగు నీటి బోర్డు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో చైన్నెలోని తిరు.వి.కా. నగర్‌ మండలంలోని పట్టాలం, స్ట్రారస్‌ రోడ్డులో, కిల్‌పాక్కం తాగునీటి శుద్ధి కర్మాగారం నుంచి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన తాగునీటి పంపింగ్‌ పైప్‌లైన్‌కు సంబంధించిన పనులు నేడు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్‌ 13వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు జరుగుతాయి. దీని కారణంగా, పనులు జరిగే సమ యంలో తండైయార్‌పేట మండలంలోని తండై యార్‌పేట, కాసిమేడు, చాకలి పేట ప్రాంతా లు, అలాగే రాయపురం మండలంలోని కాసి మేడు, చాకలి పేట తిరు.వి.కె.నగర్‌ మండలంలోని ఓట్టేరి, ఐనావరం, పట్టాలం, నమ్మళ్వార్‌పేట, పుళియంతోపు ప్రాంతాలలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరం మేరకు తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అదనపు తాగునీటి అవసరం ఉంటే, 
https://cmwssb.in.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలనిసూచించారు.

వాచ్‌మన్‌ను హత్య చేసి: మృతదేహాన్ని బావిలో పడేసిన నిందితులు

వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలో అరుంగల్‌దుర్గం గ్రామానికి చెందిన కలీల్‌కు చెందిన భూమి ఉంది. ఇక్కడ తిరుపత్తూరుకు చెందిన సయ్యద్‌ ముజీబ్‌ కుమారుడు అస్కర్‌ బాషా(38) నాలుగు సంవత్సరాలుగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అస్కర్‌ బాషా గురువారం బావిలో మృతదేహంగా కనిపించాడు. వీటిపై స్థానికులు ఆంబూరు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో అక్కడే పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన అనిల్‌కుమార్‌, ఆదీద్‌ కలిసి అస్కర్‌ బాషాను హత్య చేసి మృత దేహాన్ని బావిలో వేసి అక్కడ నుంచి పరారీ అయినట్లు తెలిసింది. దీంతో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు కార్మికుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు ఏమిటి, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

రూ.8 లక్షల దోపిడీకి యత్నం

తిరువొత్తియూరు: చైన్నె మన్నడి ప్రాంతానికి చెందిన అసరాత్‌ హుస్సేన్‌ (39). అతని అన్న ఆసిఫ్‌ అలీ (42). వారి స్నేహితులు తౌఫిక్‌ అబ్దుల్‌ రజాక్‌. వీరు ఖతార్‌లో పనిచేస్తున్నారు. బుధవారం చైన్నెకి వచ్చిన తౌఫిక్‌, అబ్దుల్‌ రజాక్‌ మన్నడి మూర్‌ వీధిలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో బస చేశారు. వీరు ఖతార్‌ నుంచి వచ్చేటప్పుడు 5 ఖరీదైన సెల్‌ఫోన్‌లను తీసుకొచ్చారు. డబ్బు అవసరం కావడంతో సెల్‌ఫోన్‌లను అమ్మి ఇవ్వమని ఆసిఫ్‌ అలీకి చెప్పారు. దీని ప్రకారం, ఆసిఫ్‌ అలీ తన తమ్ముడు అసరాత్‌ హుస్సేన్‌కు సెల్‌ఫోన్‌లు ఇచ్చి, వాటిని అమ్మి డబ్బు తీసుకురమ్మని పంపాడు. దీని ప్రకారం, పారిమునైలోని ఈవినింగ్‌ బజార్‌లోని ఓ దుకాణంలో సెల్‌ఫోన్‌లను అమ్మి, రూ 8 లక్షల తీసుకొని అసరాత్‌ హుస్సేన్‌ బైక్‌పై మన్నడికి బయలుదేరాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తుల ముఠా అతన్ని అడ్డగించి కత్తి చూపించి బెదిరించి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో, అప్రమత్తమైన అసరాత్‌ హుస్సేన్‌ బైక్‌ను కింద పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై నార్త్‌ బీచ్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్లల్లో దొంగతనం

సేలం: నామక్కల్‌ తిరుచెంగోడ్‌ సమీపంలోని రింగ్‌ రోడ్‌లో ఉన్న ఇడయార్‌పాలయం గ్రామంలో గురువారం తెల్లవారుజామున వరుసగా ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. నగలు, డబ్బు, ఇత్తడి పాత్రలు, వెండి ఉంగరాలు, టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ ద్విచక్ర వాహనం, ఎలక్ట్రిక్‌ మోటారులను దుండగులు దొంగలించుకుని పోయారు. గ్రామంలో దాదాపు 150 ఇళ్లు ఉన్నాయి. గురువారం వేకువజామున ఒకే రోజు వరుసగా ఐదు ఇళ్లలో చోరీ జరిగింది. గురువారం ఆటో డ్రైవర్‌ శక్తివేల్‌ (36), గ్రామంలోని గుడి ఇంట్లో నివసించే మెకానిక్‌ విజయకుమార్‌ (38), ప్రైవేట్‌ కళాశాలలో క్యాషియర్‌గా పనిచేస్తున్న గోపాల్‌ (35), శివగామి, అగియోర్‌ ఇళ్ల తాలాలు పగలగొట్టి ఇత్తడి పాత్రలు, బంగారు నగలు, రూ. 10,000 దోచుకున్నారు. ఒక ప్రైవేట్‌ కళాశాలలో మెకానిక్‌గా పనిచేస్తున్న గోపాల్‌ (35) ఇంటిని పడగొట్టి, ఇంటి బయట పార్క్‌ చేసిన టీవీఎస్‌ ఎక్సెల్‌ 100 వాహనాన్ని కూడా దొంగిలించారు. ఓ ప్రైవేట్‌ కళాశాలలో పనిచేసే థానప్పన్‌ ఇంట్లో నుండి విద్యుత్‌ మోటారును కూడా దొంగిలించారు. తిరుచెంగోడ్‌ గ్రామీణ పోలీసులు వేలిముద్ర నిపుణులను పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement