
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తధ్యమని తమిళ ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ ఎన్నికల శంకరావం పూరించారు. పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా మైటీవీకే పేరుతో యాప్‌ను లాంచ్ చేశారు. బుధవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం పనయూర్‌లో బూత్ లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో విజయ్ మాట్లాడారు.
రాష్ట్రంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మేం భారీ విజయం సాధిస్తాం. టీవీకే తరహా కొత్త పార్టీలు 1967,1977 జరిగిన నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. ఆ రెండు దఫాల ఎన్నికల్లో అప్పటికే రాష్ట్రంలో బలమైన పార్టీలను.. ఈ కొత్త పార్టీలు ఓటమిని రుచిచూపించాయి.
ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కంజీవరం నటరాజన్ అన్నాదురై సిద్ధాంతాల్ని ప్రస్తావించారు. అన్నాదురై తరహాలో ప్రజల్ని కలవబోతున్నాం. ప్రజల్లో ఉండటం, వారితో ప్రణాళికలు రచిచడం, ప్రజల కోసం జీవించడం. ఈ పనిలు సరిగ్గా చేస్తే ఎన్నికల్లో విజయం ఖాయం. దీంతో పాటు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో గెలవగలం.
అందుకే మై టీవీకే పేరుతో యాప్ లాంచ్ చేసినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రజల్లోకి పార్టీ చొచ్చుకుని పోయేలా కార్యకలాపాలు నిర్వహించనున్నాం’ అని తెలిపారు