బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి | Explosion In Firecrackers Factory In Tamilnadu's Virudunagar | Sakshi
Sakshi News home page

TN: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి

Jan 4 2025 11:12 AM | Updated on Jan 4 2025 11:33 AM

Explosion In Firecrackers Factory In Tamilnadu's Virudunagar

చెన్నై:తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో శనివారం(జనవరి4) భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సత్తూర్‌ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement