
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ఈ మూవీతో పాన్ వరల్డ్ హీరోగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక పుష్పరాజ్ మేనరిజంకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
తాజాగా వినాయక చవితి వేడుకల్లో పుష్పరాజ్ స్టైల్లో గణేశున్ని అలంకరించారు. ఎర్రచందనం దుంగల తరహాలో గణేశుని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీ అభిమానం సల్లగుండా అంటూ ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పుష్ప స్టైల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి తమిళనాడులోని హోసురుకు చెందిన ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ దట్ ఈజ్ పుష్ప క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. బన్నీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.