అత్యంత విషాదంగా తమిళనాడు కల్తీ సారా ఘటన.. మరణాలు ఎన్నంటే? 29 People Died Consuming Illicit Liquor In Tamil Nadu Kallakurichi. Sakshi
Sakshi News home page

తమిళనాడు కల్తీ సారా ఘటన: 37కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం స్టాలిన్‌ సీరియస్‌

Jun 20 2024 7:31 AM | Updated on Jun 20 2024 12:30 PM

29 People Died Consuming Illicit Liquor In Tamil Nadu Kallakurichi

తమిళనాడులో కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది..

Updates..

👉మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్‌ పరిహారం..

 

 

👉తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

👉కల్తీ మద్యం ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్‌దాస్‌తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది.
 

 

👉 తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుంది.

 

 

👉 కాగా, సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్‌ను వినియోగించినట్లు తేలింది

👉 నేడు తమిళనాడు అసెంబ్లీ సెషన్‌ ప్రారమైంది. ఈ నేపథ్యంలో కల్తీ సారా విషయంపై అధికార-విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

👉 ఇక, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్‌ ఆదేశాలు జారీ.

👉 ఈ కేసులో కల్తీ సారా తయారు చేసిన గోవిందరాజు సహా ఓ మహిళ, యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.

👉 కల్తీ సారా ఘటనలో దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది.

 

 👉ఈ ఘటనలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

👉ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సీరియస్‌ అయ్యారు. సీఎం స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్‌ చేశారు. 

 

👉గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. 

👉మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్‌ మీనాపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అలాగే కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్‌, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. 

👉ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్‌ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

 

 

👉ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement