
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏపీకి చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో వారి బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని విడిపించారు. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ సాధించింది.
అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి రిపీట్ అయింది. తమిళనాడుకు చెందిన కొందరు మత్స్యకారులు పొరపాటున సరిహద్దు రేఖ దాటారు. వీరి గుర్తించిన శ్రీలంక నావికాదళం దాదాపు 27 మందిని అరెస్ట్ చేసింది. దీంతో తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన దాదాపు 700 మంది జాలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. వారి ఆందోళనలతో దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో వారిని విడిపించారు. దీంతో మరోసారి తండేల్ సినిమా రిపీట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ తమిళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే.