దొంగగా మారిన గ్రాఫిక్ డిజైనర్!
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు.
ఏం జరిగిందంటే?
ఇండోర్‌లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్‌లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి.
‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్‌చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు.
బతకడం కష్టమై తప్పు చేశా..
పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


