కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్‌, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్‌, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్‌

Published Mon, May 13 2024 10:25 AM

Another Indian-Origin Man Caught In Canada's Biggest Gold Cash Heist

టొరంటోలోని ప్రధాన విమానాశ్రయంలో 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి  భారీచోరికి  పాల్పడ్డాడు. భారత్‌ నుంచి ఇటీవల  టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.  కెనడా చరిత్రలోనే భారీ చోరీగా  నమోదైంది. 

సుమారు  400 కిలోల బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   గత నెలలో  చోరీ   కేసులో  మరో ఐదుగురిని అరెస్టు చేసిన తర్వాత మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.  ఇతగాడిపై  ఇ‍ప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది (2023) ఏప్రిల్ 17 22 మిలియన్లకు పైగా కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీని  ఉన్న  ఎయిర్ కార్గో కంటైనర్‌ని నకిలీ పత్రాలను ఉపయోగించి  తస్కరించినట్టు పీల్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. 

జ్యూరిచ్ నుండి టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ తో కంటైనర్‌ వచ్చింది.   దీన్ని చాకచక్యంగా  ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు.  ఈ మేరకు అర్చిత్ గ్రోవర్‌ను టొరంటోలోని విమానాశ్రయంలో అరెస్టు చేసి అభియోగాలు మోపారు.  

 ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై కూడా  అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement