Pune Tomatoes Theft Case: 400 కిలోల టమాటాలు చోరీ

Maharashtra: 400 Kg Of Tomatoes Stolen From Farmer House In Pune - Sakshi

పుణే: టమాటాల ధర ఆకాశాన్నంటుతున్న వేళ ఈ కూరగాయ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ రైతు ఇంట్లో ఉంచిన నాలుగు క్వింటాళ్ల టమాటాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు షిరూర్‌ తహశీల్‌కు చెందిన రైతు అరుణ్‌ ధోమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం తన పొలంలో పండించిన 400 కిలోల టమాటాలను కోసి 20 క్రేట్లలో ఇంటికి తీసుకువచ్చాడు. తెల్లారాక చూస్తే అవి కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఇటీవలి పుణేకే చెందిన ఓ రైతు తను పండించిన 18 వేల క్రేట్ల టమాటాలను రూ.3 కోట్లకు అమ్మి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top