రౌండప్‌ చేసి.. అబ్బాయి మెడలో బంగారు గొలుసు కొట్టేశారు | Chain snatching in bus at Banjara Hills, Hyderabad | Sakshi
Sakshi News home page

రౌండప్‌ చేసి.. అబ్బాయి మెడలో బంగారు గొలుసు కొట్టేశారు

May 29 2025 4:06 PM | Updated on May 29 2025 4:24 PM

Chain snatching in bus at Banjara Hills, Hyderabad

బంజారాహిల్స్‌: బస్సు దిగుతున్న ప్రయాణికుడి మెడలోని బంగారు లాక్కొని పరారైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని నూర్‌నగర్‌బస్తీలో నివసించే వి.ఓంసాయిప్రకాష్‌ అనే విద్యార్థి మెహిదీపట్నంలో 19కే బస్సు ఎక్కాడు. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–7లోని జీవీకే బస్టాప్‌లో దిగుతుండగా అంతక ముందే విరించి బస్టాపులో ఎక్కిన నలుగురు వ్యక్తులు పథకం ప్రకారం తాము కూడా దిగుతున్నట్లు నటించి సాయిప్రకాష్‌ మెడలో నుంచి గొలుసు తస్కరించి ఆయనకు కిందకు తోసేసి పరారయ్యారు. గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించి అదే బస్సు ఎక్కి నిందితుల కోసం గాలించాడు. అయితే అప్పటికే వారంతా దిగిపోయినట్లు కండక్టర్‌ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం 
వెంగళరావునగర్‌ : ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన ఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడెం ప్రాంతానికి చెందిన ఎం.నాని ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటాడు. ఐదు నెలల కిందట సంధ్య, సంజయ్‌ అనే వ్యక్తులు అతనికి పరిచయమయ్యారు. తనకు మంచిజీతం ఇచ్చే జాబ్‌ కావాలని వారితో చెప్పడంతో రూ.1.40 లక్షలు చెల్లిస్తే జాబ్‌ ఇప్పిస్తామని చెప్పారు. దాంతో నాని వారు అడిగిన నగదును అందజేశాడు. అమీర్‌పేటలోని వాసవీ ఎంపీఎం మాల్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం ఇప్పించారు గాని జీతం మాత్రం ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా తప్పించుకుని తిరుగుతున్నారు. నాని వారి వివరాలు ఆరా తీయగా యువతీ యువకుడి అసలు పేర్లు షేక్‌ నాగూర్‌బీ, షేక్‌ సుభానీలుగా తెలిసింది. తనను మోసం చేసి నగదు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement