
పాత నేరస్తుడి పనే...
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న స్టీల్ హుండీలో బుధవారం రాత్రి రూ.4వేలు దొంగతనం జరిగింది. దీన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. నేరస్తుడు తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలికి చెందిన వేణుగా గుర్తించారు. నిందితుడు గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ చోరీపై తిరుమల వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.