breaking news
Tirumala temple hundi
-
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. నిన్న 64,665 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,845 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.34 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమలకు రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లు దాటుతోంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండి ద్వారా 1402 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల రూ.100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. 2023 ఏడాదిలో ప్రతీ నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు. నూతన సంవత్సరం నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు ► శారదాపీఠం ఉత్తరధికారి సాత్మానంద సరస్వతి ► తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ► జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ► సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ► డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ► మినిస్టర్ గుమ్మనూరు జయరాం ► ఏపీ లోక్ యుక్తజడ్జ్ జస్టీస్ లక్ష్మణ్ రెడ్డి ► మినిస్టర్ మెరుగు నాగార్జున ► తమిళనాడు మినిస్టర్ గాంధీ ► హీరో సుమన్ ► తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ► ఎంపీ మోపిదేవి వెంకటరమణ -
వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
-
వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
తిరుపతి: పెద్ద నోట్ల రద్దు వల్ల తోపుడు బండ్లు, చిల్లర దుకాణాలు మొదలు మాల్స్ వరకు వ్యాపారాలు పడిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. బంగారం షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్నా.. వడ్డికాసులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీపై ఏమాత్రం ప్రభావం పడలేదు. మునిపటి కంటే ఎక్కువగా శ్రీవారికి కానుకలు పోటెత్తుతున్నాయి. 'ఏడాదికి హుండీ ద్వారా మాత్రమే దాదాపు వెయ్యి కోట్ల నగదు వస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేసినా ఏమాత్రం ప్రభావం పడలేదు. దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు. బంగారు, వెండి కానుకలు గాక హుండీ ద్వారా రోజుకు సరాసరిన మూడు కోట్ల రూపాయల డబ్బు వస్తోంది. నవంబర్ 9 నుంచి పది రోజుల్లో హుండీ ద్వారా 30.36 కోట్ల రూపాయల నగదు కానుకగా వచ్చింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన డబ్బుతో పోలిస్తే ఈ మొత్తం 8 కోట్ల రూపాయలు ఎక్కువ' అని టీటీడీ అధికారులు చెప్పారు.