బిహార్‌లో పోలీసు స్టేషన్‌లో దొంగతనం | Bihar: Seized liquor stolen from police store room in Muzaffarpur | Sakshi
Sakshi News home page

బిహార్‌లో పోలీసు స్టేషన్‌లో దొంగతనం

Sep 25 2023 6:07 AM | Updated on Sep 25 2023 6:07 AM

Bihar: Seized liquor stolen from police store room in Muzaffarpur - Sakshi

పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్‌ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్‌లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు        పేలుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement