
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో భారీ చోరీ కలకలం రేగింది. స్థానికంగా ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాత్‌రూమ్ గోడకు రంధ్రం చేసి మరీ లోపలికి ప్రవేశించి 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం అర్ధరాత్రి దుకాణం వెనుక నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు దొంగలను పట్టుకునేందుకు ఐదు బృందాల ఏర్పాటు చేశామని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. స్థానికంగా ఈ ఘటన తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
