
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్‌లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.
ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #Secunderabad
A disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.
According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025