
అక్కను చంపేముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ్ముడి రీల్
హైదరాబాద్: తన అక్క ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే కారణంతో ఆమెను హత్య చేసిన నిందితుడు.. పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన రుచిత (21)ను సోమవారం ఆమె తమ్ముడు రోహిత్ (18) గొంతు నులిమి చంపగా పోలీసులు అతన్ని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
స్వగ్రామానికి చెందిన యువకుడితో అక్క ఫోన్లో మాట్లాడుతుండటంతో స్నేహితుల వద్ద పరువు పోతోందని రోహిత్ భావించాడు. దీంతో ఆమెను చంపాలనుకున్నట్లు సమాచారం. అంతకుముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?’అనే సినీ డైలాగ్‌కు తాను చేసిన రీల్‌ను షేర్ చేశాడు.