కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.
ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్‌లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.
ఈ ఏఐ హబ్‌లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్‌లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్‌ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్‌లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు.


