షాకింగ్‌ ఘటన.. స్నేహితుడి చితిని కర్రతో కొట్టి.. వైరల్‌ వీడియో | UP Man Vents His Anger On Friend Funeral Pyre Over Loan, More Details Inside | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన.. స్నేహితుడి చితిని కర్రతో కొట్టి.. వైరల్‌ వీడియో

Sep 30 2025 9:35 AM | Updated on Sep 30 2025 10:47 AM

Up Man Vents His Anger On Friend Funeral Pyre Over Loan

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదనే కోపంతో ఓ వ్యక్తి చనిపోయిన తన స్నేహితుడి అంత్యక్రియల చితిపై కర్రతో కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు అతని వద్ద నుండి తీసుకున్న రూ.50 వేలు రుణాన్ని తిరిగి చెల్లించకుండా మరణించడంతో.. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి కర్రతో వచ్చి మరణించిన వ్యక్తిని కొట్టడంతో మృతుని భార్య, పిల్లలతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది.

గతం కొంతకాలంగా స్నేహితుల మధ్య రుణ వివాదం జరుగుతోంది. మృతుడు రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ పనుల కోసం రుణం తీసుకున్నాడు. పంట అమ్మిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. కానీ అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించాడు. తన స్నేహితుడు ఉద్దేశపూర్వకంగానే డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో  నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.  ‘‘ఇది కలియుగం.. స్నేహం కూడా వ్యాపారంగా మారింది” అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు “కోపం అర్థం చేసుకోగలిగినదే.. కానీ చితిపై కూడా దాడి చేయడం? అతి క్రూరం” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement